బోయినిపల్లి, ఏప్రిల్ 3 : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝతో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 40 మంది లబ్ధిదారులకు 10 లక్షల 44,500ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, తహశీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, ఏఎంసి చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్,సింగిల్ విండో చైర్మన్ జోగినిపల్లి వెంకట రామారావు, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కూస రవీందర్,సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అనుముల హరికృష్ణ, ఏఎంసీ వైస్ చైర్మన్ వినోద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
