
జమ్మికుంట రైల్వే ప్లాట్ఫారంపై గుర్తు తెలియని మహిళ మృతి
జమ్మికుంట అక్టోబర్ 31 (జిందగీ9న్యూస్): జమ్మికుంట రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం గుర్తించారు. సుమారు 50 సంవత్సరాల వయస్సు గల ఆ మహిళ బ్రౌన్ రంగు నైటీ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె మరణం అనారోగ్య కారణాలతో జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా వస్తువులు లభించలేదు. శవాన్ని ప్రభుత్వ ఆసుపత్రి, జమ్మికుంట మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై రామగుండం ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి సంబంధించిన వివరాలు తెలిసిన వారు 9949304574, 8712658604 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
