
జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన చెన్నాం రవి (29) మంగళవారం ఉదయం గ్రామ సమీప రైలు పట్టాలపై రైలు బండి కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రాస్ బ్యాండ్లో, కూలి పనులు చేసేవాడు. అతడు వివాహం కాలేదు. మరణానికి కారణం తెలియరాలేదు. శవాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.తల్లి మదునమ్మ, అన్న ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు రామగుండం రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
