హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి (SSC) పరీక్షల ఫలితాలు రేపు ప్రకటించనున్నారు. రాష్ట్రంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ బోర్డు పరీక్షలు జరగగా, సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
ఈసారి ఫలితాల విడుదలలో ఓ ముఖ్యమైన మార్పు జరగనుంది. గతేడాది కేవలం గ్రేడ్లు మాత్రమే చూపించిన మెమోలో, ఈసారి విద్యార్థులకి విషయాల వారీగా గ్రేడ్లతో పాటు వారి మార్కులు కూడా పేర్కొననున్నట్లు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
ఫలితాలు రేపు ఉదయం లేదా మధ్యాహ్నానికి ముందు ఆధికారిక వెబ్సైట్ (https://bse.telangana.gov.in) ద్వారా అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు తమ హాల్టికెట్ నంబర్ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
— Zindagi9News
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
