
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయ ద్వారాల మూసివేత
రేపు చంద్రగ్రహణం సందర్భంగా నిర్ణయం.. మరుసటి రోజు ‘హోలీ-వసంతోత్సవం’
ఇల్లందకుంట, మార్చి 2 (zindagi9news):
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ద్వారాలను మంగళవారం మూసివేయనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రహణం వేళలు:
మార్చి 3 న (మంగళవారం) చంద్రగ్రహణం ఉన్నందున, ఉదయం 07:00 గంటలకే ఆలయ ద్వారాలను మూసివేస్తారు. తిరిగి మరుసటి రోజు అనగా బుధవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం 10:00 గంటలకు భక్తుల దర్శనం కోసం తలుపులు తెరుస్తారు.
హోలీ వసంతోత్సవ సంబరాలు:
మార్చి 4 న (బుధవారం) హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ‘హోలీ-వసంతోత్సవాన్ని’ ఘనంగా నిర్వహించనున్నారు.
* ఉదయం 09:00 గంటలకు: శ్రీస్వామి వారు గ్రామ దేవాలయం నుండి ఊరేగింపుగా బయలుదేరి ప్రధాన దేవాలయానికి చేరుకుంటారు.
* ఉదయం 10:00 గంటలకు: స్వామివారికి నిత్యనిధి కార్యక్రమాలతో పాటు శాస్త్రోక్తంగా ‘వసంతోత్సవం’, ‘డోలోత్సవం’ అత్యంత వైభవంగా జరగనున్నాయి.
ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు కోరారు.
