
జమ్మికుంట, ఫిబ్రవరి 22: భారత విద్యా ప్రదాతగా ఖ్యాతిగాంచిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి సందర్భంగా జమ్మికుంట పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు మొహమ్మద్ దౌలత్ పాషా నేతృత్వం వహించారు. నాయకులు మౌలానా ఆజాద్ చిత్రపటానికి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి సజ్జాద్ మొహమ్మద్ మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అతి చిన్న వయసులో బాధ్యతలు చేపట్టి స్వాతంత్ర్య సమరాన్ని ఉదృతం చేసిన మహనీయుడని కొనియాడారు. స్వాతంత్ర్యం అనంతరం జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తుచేశారు.
దేశం ఈరోజు విద్యా రంగంలో సాధించిన పురోగతికి మౌలానా ఆజాద్ వేసిన బలమైన పునాదులే కారణమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి సలీం, యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాతకాల రమేష్, NSUI కరీంనగర్ జిల్లా కార్యదర్శి అజ్మత్, స్టార్ రఫీ, అయ్యుబ్, పాషా, సల్లు బాబా, ఆశ్రఫ్, హాజీ, రషీద్, జావీద్, అహ్మద్, ఫాకురుద్దీన్, గఫ్ఫార్, మునీర్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
