వేర్వేరు కారణాలతో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుళ్లు సాయి కుమార్, బాలక్రిష్ణ.
మెదక్ జిల్లా కొల్చారం పీఎస్ హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ పోలీస్ క్వార్టర్స్ లో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఉదయాన్నే గమనించిన తోటి పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో ఏ ఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ తన కుటుంబసభ్యులకు విషమిచ్చి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు.. కుటుంబ సభ్యులకు విషమిచ్చిన తర్వాత ఉరి వేసుకుని చనిపోయాడు. భార్య, పిల్లల పరిస్థితి విషమం ఉంది.
