
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం పక్క వీధిలో గల శ్రీదేవి ఫార్మసీ మెడికల్ స్టోర్‌లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిజ్‌లో మంటలు చెలరేగి స్టోర్‌లోని మందులు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బకెట్లతో నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో షాపు యజమాని అక్కడ లేరు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
