
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 17.59% పోలింగ్
కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు ఐదు మండలాల్లో కలిపి 17.59 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 108 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 29,028 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లందకుంటలో 22.58%, హుజురాబాద్‌లో 20.87%, వీణవంకలో 20.06%, జమ్మికుంటలో 15.62%, వి.సైదాపూర్‌లో 8.14% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం నెలకొనగా, భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
