శంకరపట్నం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు వాహనాలను ఢీ కొట్టి, కారు రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద వివరాలు: గురువారం శంకరపట్నం మండలం తాడికల్ శివారు వద్ద ఈ ఘటన జరిగింది. వరంగల్‌కు చెందిన భూపాల్ రెడ్డి తన కారులో కరీంనగర్‌లోని పెళ్లి వేడుకలకు వెళ్లి తిరిగి వరంగల్‌కు బయలుదేరారు. తాడికల్ వద్దకు రాగానే ఒక ద్విచక్ర వాహనాన్ని, ప్యాసింజర్ ఆటోను, టాటా ఏసీ వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ దెబ్బకు కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు పల్టీ కొట్టింది. గాయపడిన వారు: కారులో ఉన్న శ్రీనివాస్ రెడ్డి, సుష్మ, సుజాత, మానస, రమాదేవిలకు గాయాలయ్యాయి. టాటా ఏసీ వాహనంలో ఉన్న రాజమల్లు స్వల్పంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనదారుడు సతీష్ కూడా గాయపడ్డాడు. ప్యాసింజర్ ఆటో డ్రైవర్ తలకు, కాలుకు తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉంది. అసుపత్రికి తరలింపు: తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ను 108 వాహనంలో కరీంనగర్ హాస్పిటల్‌కు తరలించారు. కారులోని ఎయిర్‌బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
