భారత చలనచిత్ర రంగానికి చెందిన నలుగురు దిగ్గజాలు రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, తపన్ సిన్హా,అక్కినేని నాగేశ్వరరావు లను మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ కొనియాడారు. దేశానికి ప్రపంచ గుర్తింపు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించిన సినీ ప్రముఖుల శత జయంతి వేడుకలను 2024లో జరుపుకుంటున్నామని అన్నారు. ఈ దిగ్గజాలు భారత చలనచిత్ర పరిశ్రమకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
“2024 లో పలువురు సినిమా దిగ్గజాల శతజయంతి వేడుకలను నిర్వహించుకుంటున్నాం. ఆ దిగ్గజ నటులు భారత సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చి పెట్టారు. అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమాను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు భారత సంప్రదాయాలు, విలువలను అందంగా ఆవిష్కరించాయి.”
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
