భారత ప్రభుత్వం – సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ లోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అడ్వైజరీ ప్యానెల్ మెంబర్ ( సెన్సార్ బోర్డు మెంబర్) గా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన పొడిశెట్టి అనుదీప్ సతీమణి పావని పొడిశెట్టి నియమతులు అయ్యారు. ఈ సందర్భంగా పావని పొడిశెట్టి మాట్లాడుతూ ఈ పదవిలో రెండేళ్లు కొనసాగుతారని పేర్కొన్నారు.
చలనచిత్ర రంగంలో ఎన్నో మార్పులు జరిగినప్పటికీ చలనచిత్రం ద్వారా యువత సరైన మార్గాన్ని తమ భవిష్యత్తుకి బాటలు వేసే విధంగా తన యొక్క కృషిని అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని తెలియజేశారు.
