
Telangana High Court’s key comments on the collection of pending challans
వాహనదారులను పెండింగ్ చలాన్లు చెల్లించమని బలవంతపెట్టకూడదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. చలాన్లు కట్టాలంటూ బైక్ కీలు లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించింది.
హైకోర్టు పేర్కొన్న ముఖ్యాంశాలు ఇవి:
🔹వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తేనే పోలీసులు వసూలు చేయాలి
🔹చలాన్లు చెల్లించలేదని బలవంతం చేయడం, వాహనాన్ని నిలిపివేయడం చేయరాదు
🔹చెల్లించకపోతే చట్టప్రకారం నోటీసులు జారీ చేయాలి
🔹ట్రాఫిక్ పోలీసులు అధికారాల దుర్వినియోగం చేయరాదని హితవు
పెండింగ్ చలాన్ల వసూళ్లలో న్యాయపరమైన విధానాలనే పాటించాలని, ప్రజల హక్కులను కాపాడాలని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
