బెజ్జంకి, ఫిబ్రవరి 17 : బెజ్జంకి మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.మలిదశ తెలంగాణ ఉద్యమంలో యావత్ తెలంగాణ ప్రజలని ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటంలో కేసీఆర్ పాత్ర వెలకట్టలేనిది అని, తెలంగాణ సాధించటంతో పాటు తెలంగాణ రూపు రేఖలను మార్చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది అని,కేసీఆర్ తెలంగాణ కు మార్గదర్శి, జాతిపిత కేసీఆర్ అని,తెలంగాణ ఉన్నంతకాలం ఆయన చేపట్టిన కార్యక్రమాలు చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు. సమాజంలోని అన్ని వర్గాలు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో లబ్ది పొందాయని,ఆ దేవుని ఆశీర్వాదం తో నిండు నూరేళ్లు చల్లగా, ఆయురారోగ్యాలతో ఉండాలని,కార్యకర్తలతో కలసి కేక్ కట్ చేసి, ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు.అనంతరం హరిత తెలంగాణ లక్ష్యంగా పనిచేసిన కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి,మాజీ ఏఎంసి చైర్మన్ కచ్చు రాజయ్య,వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచ్లు,ఎంపీటీసీ లు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,ఉప సర్పంచ్లు,వార్డ్ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
