బీసీలకు ఘోరమైన అన్యాయం జరుగుతుంటే సంఘాలు నోరెందుకు మూతబడ్డయ్..?
అగ్రవర్ణాలు సహా అందరూ బీసీలకు మద్దతిస్తుంటే మీరెందుకు స్పందించడం లేదు?
కుల గణనలో బీసీల జనాభాను తగ్గించడం పెద్ద కుట్ర
తెలంగాణలో ఓటర్లు 3 కోట్ల 35 లక్షల మంది ఉంటే…. జనాభా 3 కోట్ల 70 లక్షలు మాత్రమేనా?
4.30 కోట్ల జనాభా ఉందని మేధావులు, గణాంకాలు చెబుతున్నాయి
మరి 60 లక్షల మంది ఎటు పోయారు?
కేసీఆర్ ఎస్కేఎస్ సర్వేలు బీసీలు 51 శాతముంటే… రేవంత్ సర్వేలో 46 శాతానికి ఎట్లా తగ్గింది?
ఇంత ఘోరమైన అన్యాయం జరుగుతుంటే ఇంకా భరిద్దామా?
మేధావులారా…. మీ మౌనం సమాజానికే అరిష్టం…
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఎమ్మెల్సీ మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తోంది
అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిని నిలబెట్టలేదు
ఫలితంగా అవినీతి కేసుల్లో కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం లేదు
అసలు కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి?
నిరుద్యోగులు, మేధావులను నట్టేట ముంచినందుకా?
టీచర్లు, నిరుద్యోగ పట్టభద్రులకు ఇచ్చిన ఒక్క హామీనైనా అమలు చేశారా?
మోసాల కాంగ్రెస్ కు ఢిల్లీ ప్రజలు ‘గాడిద గుడ్డు’ ఇచ్చారు
కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన బండి సంజయ్
బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వెనుక పెద్ద కుట్ర ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడంవల్ల భవిష్యత్తులో తెలంగాణలోని బీసీలో పోటీ చేసే స్థానాల్లో హిందూ సమాజం గెలిచే పరిస్థితి ఉండబోదని హెచ్చరించారు. గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శమన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లను అమలు చేయడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ముస్లింలు గెలిచారన్నారు. ‘‘ఒకవైపు కుల గణన సర్వేలో బీసీల జనాభా శాతాన్ని తగ్గించి దెబ్బతీస్తున్నారు. ఇంకోవైపు బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి యావత్ హిందూ సమాజాన్నే దెబ్బతీసే ఘోరమైన కుట్ర జరుగుతోంది. ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీ సంఘాలు ఎందుకు స్పందించడం లేదు? వాళ్ల నోళ్లు ఎందుకు మూతపడ్డాయి?’’అని మండిపడ్డారు. మేధావులు, పట్టభద్రులు ఈ విషయంలో మౌనంగా ఉండటం సమాజానికే అరిష్టమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణ పాఠం చెప్పాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. మోసకారి కాంగ్రెస్ కు ఢిల్లీ ప్రజలు గాడిద గుడ్డును బహుమతిగా ఇచ్చి తగిన బుద్ది చెప్పారని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని రాంనగర్ చౌరస్తా నుండి గీతాభవన్ చౌరస్తా వరకు ‘‘పట్టభద్రుల సంకల్ప యాత్ర’’ నిర్వహించారు. ఈ యాత్రకు భారీ ఎత్తున యువకులు, ఉద్యోగులు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ యాత్రకు బండి సంజయ్ తోపాటు మెదక్, ఆదిలాబాద్ ఎంపీలు రఘునందన్ రావు, గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల శంకర్, కాటేపల్లి వెంకరమణారెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, ఉమ్మడి మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, జిల్లా అధ్యక్షులు గంగడి క్రిష్ణారెడ్డి, మాజీ మేయర్ సునీల్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను బండి సంజయ్ ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ..
ఢిల్లీలో కాంగ్రెస్ కు ఏం మిగిలింది…ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ కు ఇచ్చింది గాడిద గుడ్డు. ఇక్కడ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చేది గాడిద గుడ్డే అని ఎద్దేవా చేశారు.
నిరుద్యోగ భ్రుతి 4 వేల రూపాయలిస్తామన్నారు. 14 నెలలైంది. ఈ లెక్కన ప్రతి నిరుద్యోగికి 56 వేల రూపాయలు బాకీ పడింది. ఒక్కరికైనా నయాపైసా ఇచ్చారా? ఏమిచ్చారు గాడిద గుడ్డు? ,ప్రతి విద్యార్ధికి 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చారు. డిగ్రీ పూర్తి చేస్తే 50 వేలు, పీజీ చేస్తే లక్ష రూపాయలిస్తామన్నారు. నయాపైసా సాయం చేశారా? ఈ లెక్కన ప్రతి విద్యార్ధికి 5 లక్షల రూపాయల బాకీ పడ్డరు. కానీ ఏమిచ్చారు…గాడిద గుడ్డు ఇచ్చారు అని అన్నారు.
18 సంవత్సరాలు చదివిని ప్రతి యువతికి స్కూటీ ఇస్తామన్నారు. విద్యారంగానికి బడ్జెట్ లో 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ బీఆర్ఎస్ మాదిరిగానే 7 శాతం నిధులు దాటలేదు…. మాట తప్పిన కాంగ్రెస్ కు పట్టభద్రులు, టీచర్లు ఇవ్వాల్సింది కూడా ‘గాడిద గుడ్డే’.
కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి కూడా ఐరన్ లెగ్. వీరు ఎక్కడ ఏ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేసినా ఆ రాష్ట్రాల్లో ఆ పార్టీలు మటాష్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తే.. అక్కడ కాంగ్రెస్ పార్టీ మటాష్ అయ్యింది. ఇగ కేసీఆర్ కూడా అంతే…ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓట్లేస్తే మీ ప్రమోషన్ల గురించి, డీఏల గురించి, నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడే వారుండరు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ దే. ఫీజు రీయంబర్స్ మెంట్ అందక లక్షలాది మంది డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థులు అల్లాడుతున్నారు అని,కాలేజీల యాజమాన్యాలు నష్టపోయి కాలేజీలు మూసుకునే దుస్థితి ఏర్పడింది. డబ్బులిస్తామని టోకెన్లు ఇచ్చి కూడా నయాపైసా చెల్లించకుండా విద్యార్థుల, కాలేజీల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఓటు హక్కు లేని రైతులు, మహిళలు కూడా కాంగ్రెస్ ను ఓడించి బీజేపీని గెలిపించాలని కోరారు.
317 జీవోకు వ్యతిరేకంగా టీచర్ల పక్షాన నిలబడి కలబడిందెవరు? పోలీసుల లాఠీదెబ్బలు తిని జైలు పాలైంది మేము. మీ కోసం రక్తం చిందించింది మేం. ఆరోజు సీఎం, మంత్రులుసహా ఎవరూ మీకు అండగా లేరు.నిరుద్యోగ సమస్యపై గల్లీగల్లీలో పోరాడింది బీజేపీ. పీఆర్సీ కోసం ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన కొట్లాడింది బీజేపీనే. కానీ పొరపాటున గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేయడంతో గాడిద గుడ్డు తప్ప మీకేం మిగిలింది. కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలంటే మీ అమూల్యమైన ఓటును బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలి అని అభ్యర్థించారు.
మోదీ ప్రభుత్వం మాట ఇస్తే తప్పదు. ఇచ్చిన మాట మేరకు 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నం. 12.75 లక్షల రూపాయల పన్ను మినహాయింపు ఇచ్చింది.
మేధావులారా… మీ తీర్పు కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. మేధావులు తప్పు చేస్తే సమాజానికి తీరని నష్టం. దయచేసి మాట ఇచ్చిన తప్పిన కాంగ్రెస్ ను ఓడించండి. బీజేపీని గెలిపించండి అని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థే లేరు. ఎందుకో తెలుసా? కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోంది. ఆ రెండు పార్టీలు ఒక్కటే. మీకో విషయం తెలుసా? డ్రగ్స్ కేసులో ఆధారాలున్నా అరెస్ట్ చేయలే. కాళేశ్వరం స్కాంలో, ఫాంహౌజ్ కేసు ఏమైంది? ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్ట్ తప్పదని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఎందుకు ముఖం చాటేశారో తెలుసా? ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలోనే కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నరు. ఫలితంగా బీఆర్ఎస్ కూడా అభ్యర్ధిని నిలబెట్టకుండా కాంగ్రెస్ కు సహకరిస్తోంది.
బీసీల్లో ముస్లింలను చేర్చడం వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది. బీసీలను దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. గతంలో వైఎస్ హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తే… జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీల స్థానాల్లో బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఒక్క హిందువూ గెలవలేదు. బీసీ జాతిని కాంగ్రెస్ అవమానిస్తోంది. పొరపాటున ముస్లింలను బీసీలుగా గుర్తిస్తే… గ్రామాల్లో వాళ్లదే రాజ్యం అవుతుంది. హిందూ సమాజం గెలవలేని దుస్థితి ఏర్పడుతుంది. బీసీ సమాజమంతా చేవ చచ్చిపోతుంటే బీసీ సంఘాలు ఏమైనయ్? ఎందుకు నోరు విప్పడం లేదు? కులాల పేరుతో పాపులేషన్ ను తగ్గిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు?
మేధావి వర్గం ఆలోచించాలి. బీసీ కులాలకు అన్ని అగ్రవర్ణ కులాలు మద్దతు పలుకుతున్నయ్. బీసీలకు ఇంత ఘోరమైన అన్యాయం జరుగుతుంటే బీసీలు ఏం చేస్తున్నారని అడుగుతున్నయ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓటు ద్వారా బుద్ది చెప్పండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే… ముస్లింలను బీసీల జాబితాలో చేర్చకుండా అడ్డుకుంటాం… కాంగ్రెస్ కు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కుల గణన పెద్ద భోగస్. ఎన్నికల సంఘం తెలంణాలో 3.35 లక్షల మంది ఓటర్లుంటే… జనాభా మాత్రం 3 కోట్ల 70 లక్షల మంది మాత్రమే ఉన్నారట. తెలంగాణలో 4 కోట్ల 30 లక్షల మంది ఉన్నారని మేధావులు, నిపుణులు, గణాంకాలు చెబుతున్నయ్. మరి 70 లక్షల మంది ఎటు పోయారు? ఇదేమి అన్యాయం? అని అన్నారు.
కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 51 శాతం ఉంటే… రేవంత్ రెడ్డి కుల గణన సర్వేలో 46 శాతానికి ఎట్లా పడిపోయారు? బీసీలను అణిచివేసే కుట్ర జరుగుతోందనడానికి, బీసీలను దెబ్బతీయడానికి కాంగ్రెస్ కుట్ర చేస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని ప్రశ్నించారు.
అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న అంజిరెడ్డిని, టీచర్స్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న మల్క కొమరయ్యను భారీ మెజారిటీతో గెలిపించి నీతి, నిజాయితీకి పట్టం కట్టాలని కోరారు.
