జమ్మికుంట, ఏప్రిల్ 27 (zindagi9news): జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలోని ఆదర్శ బాలసదన్ ఉన్నత పాఠశాలలో 1998-1999 పదవ తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున “బాల సదన్ – బడి సొపతుల అపూర్వ కలయిక” పేరుతో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు పూర్వ విద్యార్థులు తమ మధుర జ్ఞాపకాలను, అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
పాఠశాల కరస్పాండెంట్ వీరగోని రాజయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ, “సంస్కారంతో కూడిన విద్యను అందించే ఉద్దేశంతో ఆదర్శ బాల సదన్ ప్రారంభించబడింది. ఈ పాఠశాల నుండి మేధావులను, ఉన్నతమైన సంస్కారవంతులను ఈ సమాజానికి అందజేసినందుకు ఎంతో ఆనందదాయకంగా ఉంది” అని తెలిపారు.
ఈ సమ్మేళనం పూర్వ విద్యార్థులకు అనుభవజ్ఞానం పంచుతూ, పాఠశాల గుర్తులను, ఆధ్యాపకులతో బలమైన సంబంధాలను గుర్తు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అని ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోడేటి సధాకర్, నరేందర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, చంద్ర కిరణ్, మహేష్ రెడ్డి, శ్రీనివాస్ మరియూ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
