
జమ్మికుంట, జూన్ 10(zindagi9news): జూన్ 6 నుండి 19 వరకు బడికి బాట కార్యక్రమంలో భాగంగా విద్యావాహిని వాహనం ద్వారా ఉపాధ్యాయులు పలు గ్రామాలలో తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులకు చైతన్యం కలిగిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరదలచుకునేలా ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. మంగళవారం జమ్మికుంట మండలం కోరపల్లి, వావిలాల, సైదాబాద్, నాగంపేట వంటి ప్రాంతాల్లో బడిబాట ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న నాణ్యమైన విద్య, కంప్యూటర్ బోధన, ఐఎఫ్సిలు, నోట్ బుక్స్, యూనిఫాంలు, లైబ్రరీ, జన్మియా ల్యాబ్, బుధవార బోధన వంటి సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించడంతో చాలా మంది సుముఖత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో CRP సురేష్, గుర్రప్ప, నాగరాజు, HM స్వర్ణమయి, ప్రవీణ్, మహేందర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

