ప్రైవేటు విద్యాసంస్థల విధివిధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఆకనపల్లి నరేష్. ప్రైవేట్ యాజమాన్యం స్కూల్ బస్సు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను బస్సులో మోతాదుకు మించి ప్రయాణించడం జరుగుతుంది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు . అదే విధంగా కేంద్ర స్థాయి విద్యా విధానాలను పాటిస్తామని చెప్పి అడ్డగోలుగా బస్ ఫీజులు, అధిక ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ విద్యా విధానంలో విద్యార్థుల తల్లిదండ్రుల సూచనలను పాటించకపోవడం వారికి పేరెంట్స్ కమిటీ నిర్వహించకపోవడం జరుగుతుంది .పదవ తరగతి విద్యార్థులను వివిధ రకాలుగా ఎక్స్ బ్యాచ్ ఏ బ్యాచ్ అని రకాలుగా విభజించి వారిని ర్యాంకుల కోసం మానసికంగా హింసించడం జరుగుతుంది వీటిపై విద్యార్థి తల్లిదండ్రులు ప్రశ్నించిన పట్టించుకోవడం లేదు కొన్ని విద్యాసంస్థలు ఇటువంటి విధానాలు ఇదేవిధంగా కొనసాగితే ప్రైవేటు విద్యాసంస్థల విధివిధానాలపై పోరాటానికి వెనుకాడమని, ఇటువంటి విధానాలపై మార్పులు రాకపోతే తీవ్రస్థాయిలో పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
