హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 కు అనుమతించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
హైదరాబాద్: నగరంలోని మెట్రో రైలు సౌకర్యాన్ని విస్తరించేందుకు ఉద్దేశించిన మెట్రో రైల్ ఫేజ్-2 కు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ను కోరారు. గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్లో మెట్రో విస్తరణపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్
✔ రూ.24,269 కోట్లు వ్యయంతో 76.4 కి.మీ పొడవున్న 5 మెట్రో కారిడార్లు ప్రతిపాదించారు.
✔ ఈ ప్రాజెక్టు త్వరితగతిన ఆమోదం పొందితే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు గణనీయమైన పరిష్కారం లభించనుంది.
రీజినల్ రింగు రోడ్ (RRR) & రీజినల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్
✔ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూ సేకరణ 90% పూర్తి అయినందున దక్షిణ భాగం మంజూరు చేయాలని సీఎం కోరారు.
✔ రిజినల్ రింగ్ రైలు ప్రాజెక్టు రాష్ట్రానికి ఉత్తమ కనెక్టివిటీ అందించనుందని, దీని కోసం కేంద్రం మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
✔ దక్షిణ భాగం భూ సేకరణ వ్యయంలో 50% తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు.
మూసీ నది పునరుద్ధరణ & బాపు ఘాట్ అభివృద్ధి
✔ రూ.20,000 కోట్లతో మూసీ నదిని పునరుజ్జీవింపజేసే ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలి.
✔ బాపు ఘాట్ అభివృద్ధి, 27 ఎస్టీపీల నిర్మాణం, రిటైనింగ్ వాల్ నిర్మాణం వంటి పనులకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని కోరారు.
తెలంగాణకు అదనపు 29 ఐపీఎస్ పోస్టులు అవసరం
✔ సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, పట్టణ విస్తరణను దృష్టిలో ఉంచుకుని తెలంగాణకు 29 అదనపు ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కోరారు.
సెమీకండక్టర్ పరిశ్రమకు తెలంగాణ అనువైన ప్రదేశం
✔ ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటు చేయాలని, దీనివల్ల దేశీయ సెమీ కండక్టర్ ఉత్పత్తిలో రాష్ట్రం ప్రధాన భూమిక పోషిస్తుందని వివరించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
హైదరాబాద్ అభివృద్ధికి మెట్రో ఫేజ్-2, రీజినల్ రింగ్ రోడ్, రైల్వే ప్రాజెక్టులు అత్యవసరమని సీఎం పేర్కొన్నారు.
