నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి పట్టణంలో చాలా బ్యాంకుల ఏటీఎంలు సరిగ్గా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నగదు డ్రా చేసేందుకు వచ్చిన ఖాతాదారులు ఏటీఎంలు ఖాళీగా ఉండడం, టెక్నికల్ సమస్యలు ఏర్పడటం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ప్రముఖ బ్యాంకుల ఏటీఎంలు నగదు లేక మూసివేయబడటంతో ప్రజలు నగదు కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యకు తక్షణ పరిష్కారం లభించలేదు.
స్థానికులు సంబంధిత బ్యాంకులు వెంటనే స్పందించి ఏటీఎంలలో నగదు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు త్వరగా చర్యలు తీసుకోకుంటే నిరసన చేపట్టే అవకాశం ఉందని ప్రజలు హెచ్చరిస్తున్నారు.
