పూజ సమయంలో చీరకు అంటుకున్న దీపం… చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం మోత్కుల గూడెం ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో పూజ సమయంలో ప్రమాదవశాత్తు చీరకు దీపం అంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది.
పోలీసుల వివరాల ప్రకారం… మోత్కుల గూడెం ప్రాంతానికి చెందిన న్యాలకంటి కనక లక్ష్మి (70) ఈ నెల 14వ తేదీ ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో ఇంట్లో దేవుడికి పూజ చేస్తూ దీపం వెలిగించారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆ దీపం ఆమె చీరకు అంటుకొని మంటలు చెలరేగాయి.
తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే హన్మకొండలోని ఎన్ఎస్ఆర్ అపోలో రిచ్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆమె పెద్ద కుమారుడు న్యాలకంటి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
