జమ్మికుంట మండలం బిజిగిరి షరీఫ్ లో ఆదివారం ఉద్యమకారుడు, జాతి బిడ్డ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సామాజిక పోరాటాల ఫలితం చిన్న పిల్లలు కావచ్చు వృద్ధాప్య పింఛన్లు కావచ్చు ఇలా ఎన్నో అన్ని విధాల ఉద్యమాల ఫలితమే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీ అవార్డును ఇచ్చింది అని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి కి పాలాభిషేకం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు. అలాగే ఆయన పోరాట కష్టాన్ని గుర్తించి ఆయనకి పద్మశ్రీ ఇచ్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఫిబ్రవరి 7న జరగబోయే వేల డబ్బులు లక్షల గొంతులతో సమానం ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ జబ్బకి డప్పు వేసుకొని కాలికి గజ్జ కట్టుకొని హైదరాబాద్ నడిబొడ్డున జరిగే ఎస్సి వర్గీకరణలో పాల్గొని పోరాడి విజయవంతం చేయాలని కరీంనగర్ ఎంఆర్పిఎస్ నాయకులు అంబాల రాజు ,సీనియర్ నాయకులు పార్లపల్లి సదయ్య, రాచపల్లి సదయ్య , కొమురయ్య, రవి ,ప్రమోద్ ,ఎర్ర యశ్వంత్ ,వెంకటేష్, రాజేష్, అంబేద్కర్, జగన్ తదితరులు పిలుపునిచ్చారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
