నిజామాబాద్ :నిజామాబాద్ జిల్లాలో ప్రైవేటు మెడికల్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని, పి వై ఎల్ పి ఓ డబ్ల్యు యువజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో, నిజామాబాద్ అర్బన్,రూరల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని,
ప్రగతిశీల మహిళా,యువజన సంఘాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి. గోదావరి, కే.సంధ్యారాణి, డి.నవీన్ కుమార్ లు పత్రిక ప్రకటనలో తెలియజేశారు.
ఉపాధ్యక్షులు ఎం. సాయిబాబ లు మాట్లాడుతూ, ప్రగతిశీల మహిళా, యువజన సంఘాల ఆధ్వర్యంలో, రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా నిజామబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో, మెడికల్ షాపుల్లో సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. మెడికల్ ఏజెన్సీలు, షాపుల్లో ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం నిర్వహిస్తున్నారని తెలిపారు.

క్వాలిటీ మందుల పేరుతో, ప్రజలకు అధిక ధరలకు విక్రయిస్తూ,విచ్చలవిడిగా దోచుకుంటున్నారన్నారు.కొన్ని మెడికల్ ఏజెన్సీలు, షాపులు కాలపరిమితి పూర్తయిన మందులను కూడా అమ్ముతున్నారన్నారని,ఫార్మసిస్ట్ లేకుండానే,మెడికల్ ఫార్మసీ సర్టిఫికెట్ ఇతరులది తీసుకొని, ఆ పేరు మీద వేరొకరు మెడికల్ షాపులు నిర్వహిస్తున్నారని అన్నారు.
జనరిక్ షాపులల్లోనూ నిర్ణయించిన ధరల కన్నా, అధిక రేట్లు వసూలు చేస్తున్నారన్నారు.డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో,విచ్చలవిడిగా మందుల అమ్మకాలు జరుగుతున్నాయన్నారు.
ప్రైవేటు,కార్పొరేట్ ఆసుపత్రుల్లో నడుస్తున్న మెడికల్ షాపుల్లో,అధిక ధరల దోపిడీ తీవ్రస్థాయిలో ఉంటున్నదన్నారు.టాబ్లెట్లు,మందులకు ప్రత్యేకమైన కంపెనీల పేర్లు పెట్టి,మందులు పూర్తిస్థాయిలో తీసుకోవాలని కండిషన్లు పెట్టి,అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు.
కొన్ని మెడికల్ షాపుల్లో మందులను నిలువ చేసే సదుపాయాలే లేవని, ఫార్మసిస్టులు లేరని తెలిపారు.
ప్రజలకు అమ్ముతున్న మందులకు సరైన బిల్లులు ఇవ్వడం లేదని,తద్వారా ప్రజలకు,ప్రభుత్వానికి తీవ్రమైన నష్టం జరుగుతున్నదన్నారు. వీటన్నిటిమీద సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉన్నదని,అందువల్ల మెడికల్ షాపులపై,ఏజెన్సీలపై ఔషధ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో,యుద్ధ ప్రాతిపదికన దాడులు జరిపి మెడికల్ మాఫియాని ని యంత్రించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో, మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సత్యక్క,జిల్లా నాయకులు పిట్ల రమ, నాగమణి, పద్మ, సునంద, నర్సవ్వ, అమూల్య, నాగమణి, పావని, శాంత, సరిత, అనిత,తదితరులు పాల్గొన్నారు.
