
ఎన్కూర్, మే 30 (జిందగీ 9న్యూస్ ప్రతినిధి):
వైరా నియోజకవర్గంలోని ఎన్కూర్ మండలంలో నకిలీ విత్తనాల కలకలం కలకలం రేపుతోంది. వర్షాకాలం సాగు ప్రారంభానికి ముందు, రైతులు నాణ్యమైన విత్తనాల కోసం సిద్ధమవుతుండగా, కొందరు దళారులు నకిలీ పత్తి విత్తనాల విక్రయానికి పాల్పడుతున్నారు.
ఈ నేపథ్యంలో పోలీసులు, అగ్రికల్చర్ శాఖ అధికారులు ఎన్కూర్ మండలంలో దాడులు నిర్వహించారు. ఒక గుదాంలో నకిలీ పత్తి విత్తనాల స్టాక్‌ను గుర్తించి, మూడు రకాల విత్తనాల బస్తాలు, సంచులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న విత్తనాల బరువు సుమారు 560 కిలోలు కాగా, వాటి విలువ సుమారుగా రూ.14 లక్షలుగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఈ కేసులో తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా విచారణ కొనసాగుతున్నట్టు ఖమ్మం జిల్లా ఎస్పీ సునీల్ దత్ మీడియాకు వెల్లడించారు.
అవకాశం దొరికిన ప్రతిసారీ రైతులను మోసం చేయడానికి దళారులు కొత్త మార్గాలను అనుసరిస్తున్నారని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విత్తనాల ధర తక్కువగా ఉంది అనే ఆశతో గుర్తించని వ్యక్తుల నుంచి కొనుగోలు చేయవద్దని, అధికారిక డీలర్షిప్ ఉన్న షాపుల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి అని ఎస్పీ సూచించారు.
“ఎవరైనా డీలర్ కాదని తెలిసిన వ్యక్తులు తక్కువ ధరకు విత్తనాలు అమ్ముతామంటూ వస్తే, వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లేదా అగ్రికల్చర్ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు మోసపోవద్దు,” అని సునీల్ దత్ హితవు పలికారు.
ఈ దాడుల్లో ఎన్కూర్ పోలీస్ సిబ్బంది, అగ్రికల్చర్ అధికారులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
