వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలంలోని తోమాలపల్లి గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదేశాల మేరకు, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
చెక్కులు అందుకున్న లబ్ధిదారుల వివరాలు:
భాను ప్రకాష్ : ₹58,000
ఖాదర్ : ₹36,000
JCB విష్ణు యాదవ్ : ₹23,000
మోహన్ రెడ్డి : ₹22,000
బత్తుల మమత : ₹9,000
మొత్తం మంజూరైన సహాయం: ₹1,48,000
ఈ ఆర్థిక సహాయం తమకు అందేలా చేసిన ప్రజా బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ రామన్ గౌడ్, సింగల్ విండో మాజీ వైస్ చైర్మన్ మహదేవ్ యాదవ్, మాజీ వార్డు మెంబర్లు రాములు నాయుడు, గుడిసె రమేష్ కుమార్, గ్రామ యువజన సంఘాధ్యక్షులు శివకుమార్, అశోక్, చంటి నాయుడు, ఉమేష్ గౌడ్, కొనింటి అశోక్, బోయ గోపాల్, తెలుగు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
