Oplus_0
బీసీ జాబితాలో ఉన్న ఎనిమిది కులాల పేర్లను మార్చాలని, కొన్ని పర్యాయపదాలు జోడించాలని సూచనలు వచ్చాయి.తెలంగాణ బీసీ కమిషన్ ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలను కోరింది. దీనిని సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసారు.
కులాల పేర్ల మార్పుల ప్రతిపాదనల ప్రకారం:
దొమ్మర (బీసీ ఏ) – గాంద వంశీయ
తమ్మలి (బ్రాహ్మణేతరులు, శూద్రులు) – బ్రాహ్మణేతర, శూద్ర పదాల తొలగింపు
రజక (చాకలి, వన్నర్) – వన్నర్ తొలగించి దోబి పర్యాయపదం చేర్పు
బుడబుక్కల – ఆరె క్షత్రియ జోషి / శివ క్షత్రియ / రామజోషి
కుమ్మర లేదా కులాల, శాలివాహన – ప్రజాపతి పర్యాయ పదం చేర్పు
చిప్పోళ్లు (మేర) – మేర
వీరముష్ఠి (నెట్టికొటాల), వీరభద్రీయ – వీరభద్రీయ
ఈ మార్పులతో, కులాల పేర్లకు మరింత గౌరవాన్ని ఇవ్వాలని భావిస్తున్నారు.
ఈ పేర్ల మార్పులపై ఎవరైనా అభ్యంతరాలు, సూచనలు ఉన్నా ఈ నెల 18వ తేదీ వరకు, హైదరాబాద్లోని జలమండలి ఆవరణలోని బీసీ కమిషన్ కార్యాలయంలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అభ్యంతరాలు నమోదు చేసుకోవచ్చు.
[3d-flip-book id=”1696″ ][/3d-flip-book]
ఈ అభ్యంతరాలు, సూచనల ఆధారంగా కులాల పేర్ల మార్పుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందని బీసీ కమిషన్ కార్యదర్శి బాలమాయాదేవి వెల్లడించారు
