తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కో-ఆపరేటివ్ సొసైటీ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ సంస్థకు అనుబంధ సంఘాలైన ప్రాథమిక విశ్వబ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీల లిమిటెడ్ సంఘాలకు గత తెలంగాణ బి ఆర్ ఎస్ ప్రభుత్వం 2019 సంవత్సరంలో సబ్సిడీ కొరకు దరఖాస్తు చేసుకొని ఒక్క రూపాయి ఇవ్వలేదు. 2023 సంవత్సరం జూన్ నెలలో ప్రభుత్వ ఐదో నెంబర్ జీవో తీసి చేతివృత్తులకు అని లక్ష రూపాయలు సబ్సిడీ ప్రకటించింది గతంలో ఆన్ లైన్ చేసుకున్న దరఖాస్తులను రిజిస్ట్రేషన్లకు సొసైటీలకు పట్టించుకోని గత ప్రభుత్వం. అభయ హస్తం మేనిఫెస్టో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అసెంబ్లీ ఎన్నికలు 2023 సంవత్సరం పేజీ నెంబర్ 16 బీసీ డిక్లరేషన్ ఈ చేతి వృత్తులకు సహాయం క్రమ సంఖ్యనెంబర్ 13 లో బీసీ కార్పొరేషన్లకు ఫెడరేషన్లకు క్రింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ మరియు రూపాయలు 10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించిన నేపథ్యంలో మా యొక్క తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీస్ బడ్జెట్ కేటాయించాలని గతంలో 2018 సంవత్సరంలో ఆన్ లైన్ దరఖాస్తు లబ్ధిదారులకు పెండింగ్ దరఖాస్తు నిధులు వెంటనే మంజూరు చేసి న్యాయం చేయాలని విజ్ఞాపక పత్రం సోమవారం రోజున హైదరాబాద్ లో సెక్రటేరియట్ సంబంధిత అధికారులకు మరియు ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపక పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి సంక్షేమ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు తొవిటి సదానంద చారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ రామగిరి లింగయ్య, రాష్ట్ర కోశాధికారి కిరణ్ కుమార్,రాష్ట్ర నాయకులు యం నరసింహ చారి, రాష్ట్ర నాయకులు వలబోజు భాస్కరాచారి, బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షులు బెల్లపు దుర్గారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీర్తి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
