బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ లో పోరుబాట – సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలక డిమాండ్

న్యూఢిల్లీ, ఆగస్టు 6:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగం, మరియు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన పోరుబాట ఉద్యమం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద గట్టిగా ముందుకు సాగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ ఉద్యమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, బీసీ నాయకులు భారీగా పాల్గొన్నారు.
రాజ్యపతికి బిల్లుల ఆమోదం కోరిన సీఎం
తెలంగాణ శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు—విద్య, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై—రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. అలాగే, రిజర్వేషన్లు 50 శాతం మించకూడ నిబంధనను సవరిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు కూడా ఆమోదముద్ర వేయాలని విజ్ఞప్తి చేశారు.
“తెలంగాణ మోడల్” దేశానికి ఆదర్శం
ఫిబ్రవరి 4, 2024న ప్రారంభించిన కులగణన ప్రక్రియను సరిగ్గా ఏడాదిలో పూర్తిచేసి, దాని ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశామని సీఎం వివరించారు. “ఇది దేశానికి ఆదర్శంగా నిలిచే మోడల్. వందేళ్ల దేశ రాజకీయాల్లో ఎవరూ చేయలేని సాహసం తెలంగాణ చేశది,” అని రేవంత్ రెడ్డి చెప్పారు.
ధర్నాకు విస్తృత మద్దతు
ఈ ధర్నాలో డీఎంకే, సమాజ్ వాది పార్టీ, ఎన్సీపీ, శివసేన, సీపీఎం వంటి విపక్ష పార్టీల ఎంపీలు పాల్గొని బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు మద్దతు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
‘‘రిజర్వేషన్ల వరకు ఉద్యమం ఆగదు’’
“ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. రాష్ట్రపతి వెంటనే మా బిల్లులకు ఆమోదం తెలపాలి. రిజర్వేషన్లు సాధించే వరకు మేం నిద్రపోం, పోరాటం ముగించం,” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
