హైదరాబాద్, గాంధీ భవన్: తెలంగాణ అభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకుంటోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, బీజేపీ నేతలు ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు చేసి, రాష్ట్రాభివృద్ధిని విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు.
కేంద్రంపై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు:
✔ తెలంగాణ అభివృద్ధికి బీజేపీ అడ్డంకి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైందవుడిలా వ్యవహరిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి మోకాలడ్డుతున్నారని ఆరోపించారు.
✔ తెలంగాణపై కిషన్ రెడ్డి విషం చిమ్ముతున్నారు: బీజేపీ బీఆర్ఎస్తో లోపాయికారీ ఒప్పందం చేసుకుని, అభివృద్ధిని కుంటుపడేలా చేస్తున్నారు.
✔ ఎంపీల ప్రశ్నించాలి: తెలంగాణకు బీజేపీ 8 మంది ఎంపీలు గెలిచారు, కానీ రాష్ట్ర అభివృద్ధికి ఒక్కసారి కూడా ప్రధాని మోదీని కలిసారా? కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నించలేదు?
✔ కేంద్రం సహకరిస్తే రాష్ట్రం ముందుకు సాగుతుంది: బీజేపీ అసలు అభివృద్ధిలో ఆసక్తి లేకుండా తెలంగాణ ప్రాజెక్టులు పక్కన పెట్టిందని విమర్శించారు.
మెట్రో, ఎయిర్‌పోర్టుల అభివృద్ధిపై కేంద్రం నిర్లక్ష్యం:
✔ మెట్రో పనులు నత్తనడకన సాగుతున్నాయి – కేంద్ర సహకారం లేకపోవడమే కారణం.
✔ మూసి నది ప్రక్షాళనకు కేంద్రం సహకరించడం లేదు.
✔ వరంగల్ మామునూరు విమానాశ్రయాన్ని రాజకీయ ఇష్యూగా మార్చడం సిగ్గుచేటు.
✔ ఆదిలాబాద్, భద్రాచలం, నిజామాబాద్ ఎయిర్‌పోర్టులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి.
తెలంగాణ బీజేపీలో అంతర్గత కుదుపులు:
✔ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం రఘునందన్ రావు ప్రయత్నాలు – కానీ పార్టీలో సమర్థవంతమైన నాయకత్వం లేని పరిస్థితి.
✔ బండి సంజయ్‌ను తొలగించి, అగ్రవర్ణానికి పదవి ఇచ్చినప్పుడు రఘునందన్ రావు ఎందుకు మౌనం వహించారు?
కవితపై విమర్శలు:
✔ “పింక్ బుక్” అంటే మొదట బీఆర్ఎస్ నేతల స్కామ్‌లను అందులో రాయాలి.
✔ మహిళా స్వయం ఉపాధిని ప్రభుత్వం బలోపేతం చేస్తోంది, కానీ కవిత మాత్రం ఉద్యమబాట పట్టారు.
✔ ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసినా కవితకు కనిపించడం లేదా?
“ఇకపై తెలంగాణ అభివృద్ధే మా లక్ష్యం. కేంద్రం సహకరించకపోతే, నిత్యం ప్రజల్లోకి వెళ్లి నిజాలు బయటపెడతాం” అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
