వీణవంక, ఏప్రిల్ 30 (zindagi9news): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో దుర్ఘటన చోటుచేసుకుంది. బుధవారం రోజు గ్రామానికి చెందిన గీతా కార్మికుడు బండ శ్రీనివాస్ (52) తాటి చెట్టు ఎక్కుతూ పడి తీవ్ర గాయాలకు గురయ్యాడు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా అతన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం. గ్రామంలో ఈ సంఘటన చుట్టూ విషాదచాయలు నెలకొన్నాయి.
