
మద్యం వ్యసనం మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన హమాలి శివకుమార్ (25) బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం – శివకుమార్ కొంతకాలంగా మద్యం అలవాటుకు బానిసై ప్రతిరోజూ తాగి ఇంటికి వచ్చేవాడు. ఈ విషయం మీద తల్లి లత తరచూ మందలించేది. ఆగస్టు 18వ తేదీ ఉదయం కూడా మందలించగా, శివకుమార్ ఇంటి నుండి బయటకు వెళ్లి గ్రామ శివారులోని ఒక వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం తల్లి లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
