
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో దారుణమైన అవినీతి చర్య వెలుగుచూసింది. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.
ఫిర్యాదుదారు కుటుంబ సభ్యుల పేర్లపై 22 గుంటల వ్యవసాయ భూమిని రిజిస్టర్ చేయడానికి అధికారిక సహాయం అందిస్తానని చెప్పి తహసీల్దారు బి. నాగార్జున, అతని కార్యాలయంలో పని చేస్తున్న అటెండర్ యాదగిరి కలిసి ఫిర్యాదుదారుడిని రూ.10,000/- లంచం కోసం డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో, అధికారులు ఉంచిన పన్నులో ఇద్దరూ పట్టుబడ్డారు. లంచం తీసుకుంటున్న సమయంలోనే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు వారిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ఈ ఘటనతో మరోసారి ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
