వరంగల్, ఏప్రిల్ 29 (Zindagi9news): కాకతీయ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగానికి చెందిన పరిశోధకురాలు చల్లా స్వప్నకు డాక్టరేట్ లభించింది. “ఆసరా పథకం — గ్రేటర్ వరంగల్ మున్సిపల్ పరిధిలో దాని అమలు” అనే అంశంపై ఆమె చేసిన సమగ్ర పరిశోధనకు యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించిందని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె. రాజేందర్ తెలిపారు.
ఈ పరిశోధనకు విభాగాధిపతి ప్రొఫెసర్ వి. రామచంద్రం పర్యవేక్షణ వహించారు. స్వప్న ప్రస్తుతం వరంగల్ నగరంలోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ మరియు కళాశాలలో సివిక్స్ పిజిటిగా విధులు నిర్వహిస్తున్నారు.
డాక్టరేట్ లభించిన సందర్భంగా చల్లా స్వప్నను యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధకులు, సహోద్యోగులు హృదయపూర్వకంగా అభినందించారు.
