బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌కు ఘన సన్మానం
పెబ్బేర్:వనపర్తి జిల్లా బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎన్నికైన సందర్భంగా తోమాలపల్లి గ్రామానికి చెందిన సురగౌని శ్రీనివాస్ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ఆదివారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బాలవర్ధన్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యుల సమక్షంలో శాలువాతో సత్కారం నిర్వహించారు.
సుమారు 15 సంవత్సరాలపాటు జర్నలిస్టుగా సేవలందించిన శ్రీనివాస్ గౌడ్, అనంతరం న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి తన కృషితో అభివృద్ధి చెందారు. ఇటీవల జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా విజయం సాధించడం గర్వకారణమని క్లబ్ సభ్యులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ – “ప్రతి రంగంలో గుర్తింపు పొందాలంటే వివాదాలకు తావులేకుండా, పెద్దలను గౌరవిస్తూ, నైతిక విలువలతో వృత్తిలో నిబద్ధతగా కొనసాగాలి. అప్పుడు మాత్రమే సరైన హోదా, గుర్తింపు లభిస్తాయి,” అని జర్నలిస్టు మిత్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు, క్లబ్ కార్యవర్గ సభ్యులు, మాజీ అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు, మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
