జమ్మికుంట, జూన్ 12 (జిందగీ 9 న్యూస్): జమ్మికుంట పట్టణంలో దాడి ఘటన జరిగింది. స్థానిక కసుబోజుల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకన్న (11.6.2025 అర్ధరాత్రి) ఇంటికి వెళ్లిన దేశిని కోటేశ్వర్ అలియాస్ కోటి అనే వ్యక్తి, రాబోయే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ బెదిరింపులకు పాల్పడ్డాడు. తిరస్కరించడంతో కోటి కర్రతో వెంకన్న తలపై దాడి చేసి గాయపర్చినట్టు సమాచారం. ఇందులో మరో గుర్తు తెలియని వ్యక్తి వెంకన్న చేతులను పట్టుకున్నాడని, దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వెంకన్న భార్యపై కూడా కోటి కర్రతో దాడి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
