
జమ్మికుంటలో చైల్డ్ లేబర్ గుర్తింపు – యాజమాన్యంపై కేసు నమోదు
కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ డెక్క చందన తమ సిబ్బందితో కలిసి జమ్మికుంట పరిధిలో తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా జమ్మికుంటలోని శ్రీమాతా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (బిస్లెరి వాటర్ ప్లాంట్) లో పనిచేస్తున్న సూరజ్ కుమార్ (11) బీహార్ రాష్ట్రానికి చెందిన బాలుడిని చైల్డ్ లేబర్‌గా గుర్తించారు. బాలుడిని పనిలో పెట్టుకున్నట్లు నిర్ధారణ కావడంతో, జమ్మికుంట గ్రామానికి చెందిన కంకణాల అనిత రెడ్డి (భర్త: కిరణ్ కుమార్ రెడ్డి) పై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు.
