
జమ్మికుంట మండలంలో విగ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా
జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి శ్రీ ఎర్రబండల శివ నాగేంద్ర భక్తాంజనేయ స్వామి ఆలయంలో విగ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈరోజు మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు జగ్గయ్యపల్లి, రంగమ్మపల్లి గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు.
అన్నప్రసాద దాతలుగా బాలసాని స్వరూప శ్రీనివాస్, బాలసాని తేజశ్రీ రజినీకాంత్, రిషికేష్, రవళి కుటుంబ సభ్యులు సేవలు అందించారు. వీరందరికీ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఉత్సవ కమిటీ ఆకాంక్షించింది.
