టేకుమట్ల, ఫిబ్రవరి 1: టేకుమట్ల మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మండల అధ్యక్షులు దూడం రాజు ఆధ్వర్యంలో శనివారం రోజున శ్రీ భక్త మార్కండేయ స్వామి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర చేనేత విభాగం నాయకులు ఆడెపు సంపత్ ముఖ్య అతిథులుగా పాల్గొనీ మండల సంఘం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరంగా ఉందని వారికి కృతజ్ఞతలు తెలిపారు. వారితోపాటు పద్మశాలి సంఘం మండల నాయకులు వంగ నరేష్, పోలు రమేష్, దూడం రాములు, మచ్చగిరి సారయ్య, దూడం బిక్షపతి, వెంట వేణు, ఊషకోయల శంకర్, బండి ప్రసాద్, పెండెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
