
మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంటల వరకు 84.35% పోలింగ్
కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంటల వరకు ఐదు మండలాల్లో కలిపి 84.35 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 110 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, 1,39,222 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లందకుంటలో 85.35%, హుజురాబాద్‌లో 85.06%, జమ్మికుంటలో 82.10%, వీణవంకలో 82.39%, వి.సైదాపూర్‌లో అత్యధికంగా 87.46% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రశాంత వాతావరణం నెలకొంది.
