బోయినిపల్లి; ఫిబ్రవరి 16 :రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామ శివారులో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై పృధ్విధర్ గౌడ్ తెలిపారు.ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం గ్రామ శివారులో గల రైస్ మిల్ వద్ద వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడని సమాచారం రావడంతో సంఘటన స్థలానికి చేరుకొని కొండవేని గంగాధర్ (21) తండ్రి రాములు అనే వ్యక్తి దగ్గర 64 గ్రాముల గంజాయి పట్టు పడగా గంగాధర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
