కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడి మృతికి తీవ్ర సంతాపం తెలిపిన డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి

పెబ్బేరు, జూలై 27:వనపర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సుధాకర్ గౌడ్ మృతి పట్ల AIPC నేషనల్ కోఆర్డినేటర్ డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి తీవ్ర సంతాపం తెలిపాడు. ఈ రోజు కంచిరావుపల్లి గ్రామంలో నిర్వహించిన దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొన్నాడు. గతంలో వివిధ కార్యక్రమాల కారణంగా రాలేకపోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశాడు.
సుధాకర్ గౌడ్ కాంగ్రెస్ కార్యకలాపాల్లో ఎప్పుడూ ఉత్సాహంగా పాల్గొనేవాడని, పార్టీ కార్యకర్తలకు ఉత్తేజం కలిగించే నాయకుడని పేర్కొన్నాడు. ఆయన లేనిది కాంగ్రెస్ పార్టీకి తీరనిరూపమైన లోటని అభిప్రాయపడ్డాడు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి కొంత ఆర్థిక సహాయం అందజేశాడు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంపురం సహదేవుడు, శశిధర్ రెడ్డి, రాజు నాయక్, ఎల్ల స్వామి నాయుడు, రాము తదితరులు పాల్గొన్నారు.
