ఎలివేటర్ యంత్రంలో ఇరుక్కుపోయి బమ్మ వనిత(54) అనే మహిళ కూలి మృతి చెందిన సంఘటన శుక్రవారం జమ్మికుంట పట్టణం పద్మశాలి వీధి లో చోటు చేసుకుంది. మృతురాలు ఆబాది జమ్మికుంట లోని ఆగ్రో ఇండస్ట్రీస్ బాయిల్ రైస్ మిల్లులో పనిచేస్తుంది. జనవరి 22న మిల్లులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఎలివేటర్ యంత్రంలో తలకు ఉన్న టవల్ ఇరుక్కుని చేతు తెగిపోయింది, తలకు బలమైన గాయాలు కావడంతో మిల్లు సిబ్బంది వెంటనే చికిత్స కై హాస్పటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది అని మృతురాలి కుమారుడు బమ్మ ఈశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట పట్టణ సిఐ తెలిపారు.
