హైదరాబాద్:కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మైనారిటీ పట్టభద్రులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్కు ఓటు వేయడానికి సిద్ధంగా లేరని బిజెపి మైనారిటీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు అఫ్సర్ పాషా అన్నారు. ఆదివారం బిజెపి జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మైనారిటీలను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ సర్కార్కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
“పట్టభద్రులు, ఉపాధ్యాయులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేకపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలాగే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టభద్రుల సమస్యలను పట్టించుకోవడం లేదు. 14 నెలలు గడిచినా జాబ్ క్యాలెండర్ను ప్రకటించలేకపోయింది” అని ఆయన విమర్శించారు.
అఫ్సర్ పాషా మాట్లాడుతూ, “కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి విద్య వ్యాపారి. ఆయన నిరుద్యోగ సమస్యల కోసం ఏనాడు పోరాడలేదు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది. రాష్ట్రంలో కమిషన్ల ప్రభుత్వమే రాజ్యమేలుతోంది” అని మండిపడ్డారు.
“రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు కనీస బెనిఫిట్స్ కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా నిలబెట్టే సామర్థ్యం లేకపోయింది” అని ఎద్దేవా చేశారు. మైనారిటీల అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని, ప్రధాని మోడీ మైనారిటీలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు.
బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు
ఈ సందర్భంగా అఫ్సర్ పాషా, బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమురయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మైనారిటీలను కోరారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ముజీబ్, జిల్లా అధ్యక్షుడు సమీపరవేజ్, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ మొహమ్మద్ బషీరుద్దీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ తాజ్, సిద్ధిక్ షాదాబ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సమీయుల్లా అహ్మద్, కార్యదర్శి సాబీర్, ఉపాధ్యక్షుడు సైద్, ఫయాజ్ చిస్తీ తదితరులు పాల్గొన్నారు.
(మరిన్ని రాజకీయ వార్తల కోసం Zindagi9News.co.in ను అనుసరించండి)
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
