
ఎమర్జెన్సీ పాలనపై సీపీ సజ్జనార్ ఘాటు వ్యాఖ్యలు
“ఎమర్జెన్సీ పాలన ఉందని కొందరు మాట్లాడుతున్నారు. నిజంగా ఎమర్జెన్సీ ఉంటే మీరు అందరూ కూడా లోపల ఉండే వాళ్లు” అని సీపీ సజ్జనార్ వ్యాఖ్యానించారు.
ఇదే సందర్భంలో ఒక జర్నలిస్ట్ స్పందిస్తూ—
“ఇంటి తలుపులు పగలగొట్టి జర్నలిస్ట్ భార్యను భయబ్రాంతులకు గురిచేస్తూ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా?” అని ప్రశ్నించారు.
దీనికి సీపీ సజ్జనార్ కఠినంగా స్పందిస్తూ—
“బరాబర్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్‌కి సహకరించండని మేము వచ్చినప్పుడు మా వెంట రావాలి. రాను అంటే మేము చేయాల్సిన రీతిలో చేస్తాం” అని స్పష్టం చేశారు.
➡️ ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పోలీస్ చర్యలు, జర్నలిస్టుల స్వేచ్ఛపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
