న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) 2025 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ ఫలితాలను ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ indiapostgdsonline.gov.in లో చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
1. ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ (indiapostgdsonline.gov.in) కు వెళ్లండి.
2. హోమ్‌పేజీలో “Shortlisted Candidates List” లింక్‌పై క్లిక్ చేయండి.
3. మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, సంబంధిత మెరిట్ లిస్ట్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
4. మెరిట్ లిస్ట్‌లో మీ పేరు లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా మీ స్టేటస్ చెక్ చేసుకోండి.
అభ్యర్థులకు సూచనలు
ఎంపికైన అభ్యర్థులు తదుపరి ధృవీకరణ ప్రక్రియ కోసం సంబంధిత పోస్టల్ డివిజన్ అధికారులతో సమర్పించాల్సిన పత్రాలను సిద్ధం చేసుకోవాలి.
మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులను ఇండియా పోస్ట్ పోస్టింగ్ ప్రక్రియకు పిలుస్తుంది.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
— Zindagi9News
