సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మవద్దు
స్థానికంగా అందుబాటులో ఉండి సేవ చేస్తా
ఓట్ల కోసం వచ్చి పారాచుట్ లీడర్లను నమ్మవద్దు
ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం రోజున పట్టభద్రులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్, ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు , మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రులు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు తమ విద్యాసంస్థలు ద్వారా ఎందరో పేద విద్యార్థులకు చదువులు అందించామని, రానున్న రోజుల్లో పేద విద్యార్థులకు రాయితీ కల్పిస్తానని హామీ ఇచ్చాడు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. దాదాపు 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. గిట్టని వాళ్ళు చేసే అసత్య ఆరోపణలు పట్టభద్రులు నమ్మవద్దని కోరారు…
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
