విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే క్రీడల పోటీల పట్ల ఆసక్తి కనబరిచే విధంగా ప్రణాళికలు రూపొందించాలని మరియు దానికి తగిన వనరులను కల్పించినట్లయితే పలు క్రీడా పోటీలలో విజయాలు సాధించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అల్ఫోర్స్ విద్యా సంస్థల నిర్వాహకులు వి. మల్లారెడ్డి స్థానిక వావిలాలపల్లి లోని అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించినటువంటి క్రీడోత్సవ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెంచాల్సిన అవసరం ఎంతగానో ఉందని మరియు ఎదురవుతున్నటువంటి ఒత్తిడిని క్రీడలతో అధిగమించవచ్చని చెప్పారు.క్రీడల ద్వారా విద్యార్థులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని మరియు పలు పరీక్షలలో విజయాలను చాలా సులువుగా సాధించవచ్చని వారు తెలిపారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ ఇప్పిస్తూ వివిధ స్థాయిలలో నిర్వహింపబడేటువంటి పోటీలకు ఎంపిక చేయడమే కాకుండా వారికి తగిన ప్రోత్సాహంతో పాటు వనరులను కల్పించి విజేతలుగా తయారు చేస్తున్నామని చెప్పారు. విద్యా సంస్థల్లో విద్యార్థులకు అన్ని రకాలుగా చేయూతనిస్తూ క్రీడల పట్ల మక్కువ పెంచుతున్నామని చెప్పడంలో ఎటువంటి సందేహాలు లేదని తెలుపుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలు పరిష్కరించుకొని పాఠశాలలో విద్యార్థులకు వివిధ వినోదాత్మక క్రీడల పోటీలను నిర్వహించడం జరిగిందని చెప్పారు.

క్రీడల పోటిలలో భాగంగా విద్యార్థులకు పరుగు పందెం, ఫ్రార్గ్ జంపింగ్, ఈటింగ్ చాలెంజ్, మ్యూజికల్ చైర్ చాక్లెట్ క్యాచింగ్ తదితర పోటీలను నిర్వహించడం జరిగిందని తెలుపుతూ చాలా ఉత్సాహంతో క్రీడా పోటీలలో పాల్గొన్నటువంటి విద్యార్థులందరికీ శుభాభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
