కరీంనగర్ ,జనవరి 28:విద్యార్థులకు ప్రాథమిక స్థాయి నుండి వివిధ విషయాల పట్ల ముఖ్యంగా గణితం మరియు సైన్స్ లోని విషయాలను చాలా సమగ్రంగా తెలియపరచి వాటిలో సృజనాత్మకతను పెంపొందించడానికి చిత్రలేఖనాన్ని ఉపయోగించుకోవాలని మరో చరిత్ర ద్వారా వివిధ అంశాలను చాలా సులభంగా గుర్తు పెట్టుకోగలుగుతామని తద్వారా విజయాలను చాలా సునయానంగా సాధించవచ్చని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి స్థానిక కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ- టెక్నో పాఠశాలలో విద్యార్థులు చింతన ప్రకాశన్ వివిధ ఒలంపియాడ్లలో జాతీయస్థాయి ర్యాంకులను సాధించిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు గణితం మరియు సైన్స్ లోని విషయాలను చాలా విశ్లేషణాత్మకంగా బోధించడమే కాకుండా వాటిలోని విషయాలను చాలా ప్రయోగాత్మకంగా విన్నూత్నంగా తెలపాల్సిన అవసరం ఎంతగానో ఉందని గుర్తు చేస్తూ ప్రతి విద్యార్థి కూడా పుస్తకాలలోని విషయాలను చాలా గొప్పగా స్ఫూర్తిదాయకంగా నేర్చుకొని పట్టుసాధించడమే కాకుండా వివిధ స్థాయిలో నిర్వహించబడినటువంటి పోటీ పరీక్షలలో సైతం పాల్గొని ఖ్యాతి గడించాలని సూచించారు.
విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనుసరించినటువంటి మార్గాలను పాటించి వాటిలో విజయాలను చాలా గొప్పగా సాధించి మంచి పేరు సంపాదించుకోవాలని సూచిస్తూ ఇటీవల కాలంలో కర్ణాటకకు చెందిన ప్రముఖ పోటీ పరీక్షల సంస్థ అయిన చింతన ప్రకాశన్ వారు నిర్వహించినటువంటి మ్యాథ్, సైన్స్ మరియు చిత్రలేఖనం ఒలంపియాడ్లో పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు
జాతీయస్థాయి ర్యాంకులు
చిత్రలేఖనం ఒలంపియాడ్: టి. భవిష్య, 4వ తరగతి, ఎ. సమీక్ష, 8వ తరగతి
మ్యాథమెటిక్స్ ఒలంపియాడ్: ఇ. సుహాస్ 7వ తరగతి, జి. సాయి సంహిత 8వ తరగతి
సైన్స్ ఒలంపియాడ్: యన్. వినాయక్ 7వ తరగతి
రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి ర్యాంకులు సాధించి అద్భుతమైన ప్రతిభను కనబరచడమే కాకుండా జాతీయ స్థాయిలో ప్రశంసనీయమైన ర్యాంకులు సాధించి పాఠశాల కీర్తిని చాటారని ప్రశంసిస్తూ రానున్నటువంటి రోజుల్లో మరిన్ని అద్భుత విజయాలు నమోదు చేసి తెలంగాణ రాష్ట్రానికి వన్నె తేవాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
