హుజురాబాద్ బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అలేటి సుశీల నియమితులయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత మొగిలిరావు ఆమోదం తెలిపారు. కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20, 2025న నియామక ఉత్తర్వులను హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ అందజేశారు.
ఈ సందర్భంగా కర్ర సత్యప్రసన్న రెడ్డి మాట్లాడుతూ, “మహిళా కాంగ్రెస్ బలోపేతానికి, మహిళా సాధికారతను మరింతగా ప్రోత్సహించేందుకు అలేటి సుశీల శక్తివంతమైన నాయకత్వాన్ని అందిస్తారని విశ్వాసం ఉంది” అన్నారు.
అలేటి సుశీలకు నియామక ఉత్తర్వులు అందిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆమెకు అభినందనలు తెలిపారు.
