అర్థం కాని కోర్సు…చదువులో రాణించలేక..చనిపోయిన శివాని సూసైడ్ నోట్ వైరల్

హనుమకొండ: చదువు ఒత్తిడిని తట్టుకోలేక ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన హనుమకొండ నయీంనగర్‌లో చోటు చేసుకుంది. స్థానిక ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న శివాని అనే విద్యార్థిని వసతిగృహ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతిచెందింది. మృతికి ముందు తల్లి కోసం భావోద్వేగంతో సూసైడ్ నోట్ రాసింది.
“మమ్మీ… చెల్లిని బాగా చదివించండి. నాకు అర్థం కాని చదువులు వద్దు. చదువు ఒత్తిడితో మైండ్ పోతోంది. నాకు చావే దిక్కు” అని ఆమె ఆఖరి మాటల్లో తెలిపింది. తల్లిదండ్రులు ఇష్టపడని కోర్సు చదవడం వల్ల ఒత్తిడికి గురై ఈ నిర్ణయం తీసుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు శవాన్ని ఎంజీఎం హాస్పిటల్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
